Amaravati: మాస్క్ లేకపోతే బస్ లోకి నో ఎంట్రీ
Amaravati: మాస్క్ లేకపోతే బస్ లోకి నో ఎంట్రీ అని ఏపీఎస్ఆర్టీసీ తేల్చి చెప్పింది.
Amaravati: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో దేశంలో మరో సారి పడగ విప్పింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీఎస్ ఆర్టీసీ కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టంది. అందుకే బస్సు ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరి అని ఏపీఎస్ఆర్టీసీ ఆదేశించింది. మాస్క్ లేకపోతే బస్ లోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పింది.
రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో నిత్యం శానిటైజర్ అందుబాటులో ఉంచుతూ, బస్టాండులను నిత్యం శానిటైజ్ చేయాలని ఆదేశించింది. దాదాపు అన్ని బస్టాండ్లలో మాస్క్ లు విక్రయించనున్నట్లు ప్రకటించింది. డ్రైవర్లు - కండక్టర్లు - ఇతర ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది.
ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఇప్పటికే నిబంధనలు ఉన్నా.. అందరూ వాటిని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సిబ్బంది సైతం పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. కానీ ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం పట్ల అలక్ష్యం వహించకూడదని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొవిడ్ కేసులు పెరిగిన వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యారోగ్య శాఖ మరోసారి సూచించింది.