కరోనాను జయించేలా వేదమంత్రాల పఠనం

*దేశవ్యాప్తంగా ప్రబళించిన మహమ్మారి వైరస్‌ *ఎన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనానికి బ్రేక్‌ *ప్రజలను కాపాడేందుకు సైంటిస్టులు ప్రయోగాలు

Update: 2021-01-20 13:42 GMT

తిరుమల ఫైల్ ఫోటో 

కరోనా వైరస్‌ను తరమికొట్టాలని టీటీడీ వేదపండితులు వేదాలను పఠిస్తున్నారు. వైద్య విజ్నానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో మహర్షల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవాస్థానం అనుసరించింది. శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీతో మహమ్మారిని తరిమేందుకు ప్రయత్నం చేస్తే.. వేదపండితులు అనాదిగా వస్తున్న విధానాలను పాటిస్తున్నారు. వేదంలో చెప్పిన ఎన్నో మార్గాల్లో టీటీడీ అనుసరించిన విధానంలోని వైశిష్ట్యం ఏంటో మీరే చూడండి.

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కి వైద్యులు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. చెప్పాలంటే మహమ్మారి వైరస్‌ ప్రబళించిన తర్వాత ప్రశ్నర్ధకమైన పరీక్షా కాలం ఎదురైంది. దీంతో కరోనా వల్ల తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం ఆగిపోయింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు సైంటిస్టుల ప్రయత్నం ఒక కోణం కాగా టీటీడీ దేవస్థానం కూడా రామాయణంలోని వేదమంత్రాలతో కరోనాను జయించేలా మరోప్రయత్నం చేసింది. వేదా విజ్నాన పీఠాధిపతులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కరోనా వైరస్‌ లాంటి జబ్బులు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వేద మంత్రాలు సహాయం చేయదగినదని మన పురాణాలు చెబుతున్నాయి. ధర్మబద్ధమైన కావ్యాలు చదవడం ద్వారా ధార్మిక దృష్టి పొంద కలిగే శక్తిని దేవుడు ప్రసాదిస్తారని చరిత్ర చెబుతోంది. దీంతో వైరస్‌ నుంచి ప్రజలకు విముక్తి కల్గించి శ్రీవారి అనుగ్రహం ప్రసాదించేందుకు.. టీటీడీ అధికారులు ఆగమ సలహా మండలి చర్చించి యోగవాశిష్టం శ్రీ ధన్వంతరి మహామంత్ర పారాయణం నిర్వహించింది. అంతేకాక సుందరకాండ పారాయణం ప్రారంభించింది.

 టీటీడీ చేపట్టిన పరిష్కారాలలో ఎందరో వేదపండితులు భాగస్వాములయ్యారు. పరిపాలన చేసే కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మరెందరో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమాజానికి మేలు చేయమని దేవుడ్ని ప్రార్థించి కరోనా వైరస్‌ నుంచి విముక్తి కలిగించాలని వారు వంతు ప్రయత్నం చేశారు. ఇక భగవద్గీతలో చెప్పబడినట్లు ఎవరి ప్రయత్నం వారు చేస్తే ఫలితం వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.



Tags:    

Similar News