Nara lokesh satires on AP Government: ఏపీ ప్రభుత్వం పై లోకేష్ సెటైర్లు
Nara lokesh satires on AP Government: కరోనా పుణ్యమా అని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను
Nara lokesh satires on ap govt : కరోనా పుణ్యమా అని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపైన ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇందులో లోకేష్ ఏపీ ప్రభుత్వం పైన సెటైర్లు పేల్చారు.బాదుడే బాదుడు.
కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు.పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో! అంటూ సెటైర్లు పేల్చారు లోకేష్!
బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు.పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. (1/2) pic.twitter.com/yczGWpUwqV
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 21, 2020
ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజీల్‌పై రూ. 0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమారు రూ. 4480 కోట్ల మేర రావాల్సిన రెవన్యూ ప్రస్తుతం రూ. 1323 కోట్లు మాత్రమే వస్తోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం తెలిపింది.