Nara Lokesh Provide Health Insurance To Journalists: నారా లోకేష్ మంచి మనసు : జర్నలిస్టు లకి బీమా ధీమా!

Nara Lokesh Provide Health Insurance To Journalists: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గొప్ప మనసు చాటుకున్నారు

Update: 2020-07-19 17:46 GMT
nara lokesh

Nara Lokesh Provide Health Insurance To Journalists: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గొప్ప మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి, దుగ్గిరాల‌లో ప‌నిచేస్తున్న ప్రింట్‌, ఎల‌క్ర్ట్రానిక్ మీడియాలోని 62 మంది జర్నలిస్టులకి లోకేష్ జీవిత భీమా చేయించారు. ఇందులో సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20 లక్షలు, కోవిడ్‌ మరణాలకూ బీమా వర్తింపజేసేలా ప్రీమియం చెల్లించినట్లు లోకేష్ వెల్లడించారు.

ఇక ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. కరోనాని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోకేశ్‌ అన్నారు. ఇక కరోనా సమయంలో జర్నలిస్టులు త‌మ ప్రాణాలు ప‌ణంగా పెట్టి జ‌ర్నలిస్టులూ విధులు నిర్వర్తిస్తున్నార‌ని.. అందుకే తన వంతుగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని జ‌ర్నలిస్టుల‌కు బీమా చేయించాన‌ని వెల్లడించారు.

అటు ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జ‌ర్నలిస్టులంద‌రికీ బీమా సౌకర్యం కల్పించాలని, కరోనాతో చనిపోయిన జ‌ర్నలిస్టు కుటుంబాల‌కు 50 ల‌క్షల ప‌రిహారం ఇవ్వాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు. ఇక జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడిన లోకేష్.. విధి నిర్వహణలో చాలా జాగ్రతగా ఉండాలని అన్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన‌వ‌స‌ర ప్రయాణాలు మానుకోవాల‌ని లోకేష్ మాట్లాడారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో తాజాగా గత 24 గంటల్లో 31,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,041 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1106 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,755 కి చేరుకుంది.  

Tags:    

Similar News