Nara Lokesh: ఇవాళ ఢిల్లీ నుంచి ఏపీకి నారా లోకేష్
Nara Lokesh: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న లోకేష్
Nara Lokesh: ఏపీలో ప్రస్తుతం కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును ప్రస్తావిస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇప్పుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపైనా అభియోగాలు ఉన్నాయి. వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇక తదుపరి అరెస్ట్ నారా లోకేష్ దేనా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఇవాళ ఏపీ రానున్నారు. దాదాపు 10 రోజులకు పైగా హస్తినలోనే మకాం వేశారు లోకేష్. తన తండ్రి అరెస్టుపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేసులకు భయపడే ఢిల్లీ పారిపోయాడని ఆరోపించారు. అదే రేంజ్‌లో వైసీపీ నేతలకు విమర్శలకు నారా లోకేష్ సవాల్ విసిరారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎన్నికేసులు పెట్టిన పోరాడతామన్నారు.
మరో వైపు ఎల్లుండి నుంచి యువగళం పాదయాత్రను కూడా పున:ప్రారంభించనున్నారు నారా లోకేష్. విరామం ఇచ్చిన రాజోలు నియోజకవర్గం నుంచే పాదయాత్ర ప్రారంభంకానుంది. తండ్రి అరెస్టు తర్వాత జరగనున్న పాదయాత్ర ఎలా ఉండబోతుంది. తన ముందున్న బాధ్యతలను లోకేష్ నిర్వహించగలడా అనే చర్చ టాక్ ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతోంది. మరో వైపు నారా లోకేష్‌పై నమోదు చేసిన కేసుల్లో ఏం జరగబోతుందోనన్న చర్చ నడుస్తోంది.