జ‌గ‌న్‌రెడ్డి గారూ..పరిపాలన రాజధాని అంటే కబ్జాలు చేయడమేనా..? లోకేశ్ ఫైర్

ప్రభుత్వాంపై విమర్శలు కురిపిస్తూ ట్విట్స్ చేశారు.

Update: 2021-02-05 10:59 GMT

నారా లోకేష్ ఫైల్ ఫోటో 

ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వాంపై విమర్శలు కురిపిస్తూ ట్విట్స్ చేశారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని లోకేశ్ అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై నారా లోకేశ్ స్పందించారు. త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారని ఆరోపించారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారు. ''ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం. ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి గారూ!కాకినాడ పోర్టు అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారు'' అని నారా లోకేశ్ ఆరోపించారు. 



Tags:    

Similar News