Pendurthi: పేదలకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్సీ మాధవ్

పెందుర్తి: ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు, అభాగ్యులకు సహాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు.

Update: 2020-04-27 02:31 GMT

పెందుర్తి: ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు, అభాగ్యులకు సహాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు.పెందుర్తి వెలమ తోటలో జీవీఎంసీ 96 వార్డ్ బిజెపి, జనసేన పార్టీల కార్పొరేటర్ అభ్యర్థి గొర్లి రాము నాయుడు ఆధ్వర్యంలో పేద ప్రజలకు, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని వాటిని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారికి సాయం చేయగలిగే స్థోమత ఉన్నవారందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

అలాగే 96వ వార్డ్ ప్రజలందరికీ మరియు పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గల యాచకులు, అభాగ్యులు, నిరుపేదలు, వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఇతరులకు లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్న రాము నాయుడు అని అభినందించారు. రామునాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తానని తెలిపారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజలు కష్టాల్లో ఉన్నందున తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోన మంగయ్యనాయుడు, 92వ వార్డ్ బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థిని పాత్ర దేవి పద్మజా తదితరులు పాల్గొని జర్నలిస్టుల సేవలు గుర్తించి సన్మానాలు చేశారు.


Tags:    

Similar News