వైసీపీ హైకమాండ్‌కు చేరిన మచిలీపట్నం పంచాయితీ

*ఎంపీ బాలశౌరి వర్సెస్ ఎమ్మెల్యే పేర్ని నాని

Update: 2022-06-11 09:01 GMT

వైసీపీ హైకమాండ్‌కు చేరిన మచిలీపట్నం పంచాయితీ

Perni Nani Vs Balashowry: కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు అధిష్టానం దృష్టికి చేరింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరిని మాజీ మంత్రి పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయంపై ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్నినానితో వైసీపీ పెద్దలు చర్చించారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి మంచిది కాదని ఇరు వర్గాలకు అధిష్టానం సర్దిచెప్పింది. సమస్య ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. మరోవైపు మూడు రోజులుగా మాజీ మంత్రి పేర్నినాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్వరలో బందరులో జరిగిన పరిణామాలు, ఎంపీ బాలశౌరి వ్యాఖ్యలపై స్పందిస్తానని తెలిపారు.

నిన్న మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ బాలశౌరిని వైసీపీ కార్పొరేటర్ అస్గర్ అలీ, పేర్ని నాని వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇనకుదురు పేటలోని శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరటంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్​కు ఎంపీ రావటం సరికాదన్నారు. ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచురులతో మోహరించి ఎంపీని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం దృష్టికి బందర్ పంచాయితీ చేరింది.

Tags:    

Similar News