Kodali Nani: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ టూరిస్టులు... కేఏ పాల్‌‌ను మించి..

Kodali Nani: చంద్రబాబు, పవన్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు.

Update: 2022-11-05 12:13 GMT

Kodali Nani: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ టూరిస్టులు...

Kodali Nani: చంద్రబాబు, పవన్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. లేని సమస్యలను సృష్టిస్తూ.. టీడీపీ, జనసేన డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు తనపై తానే గులకరాళ్లు వేయించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న కొడాలి నాని.. చంద్రబాబు, పవన్ పొలిటికల్ టూరిస్ట్‌లంటూ ఆరోపించారు. మునుగోడులో కేఏ పాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రక్తి కట్టించారని.. ఆయన కంటే వెనకబడిపోయానని పవన్‌ ఇప్పటం వచ్చారని ఎద్దేవా చేశారు.

ఇప్పటంలో షో అయిపోగానే 2 గంటల కల్లా వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అసలు, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. లేని సమస్యలను పవన్‌, చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరూ వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News