విశాఖలోని అక్కయ్యపాలెం రెడ్ జోన్లో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విస్తృతంగా పర్యటించారు. నిత్యావసరాలు సరఫరాకు సంబంధించి ప్రభుత్వ సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా కంటైన్మెంట్ జోన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు.