బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘ‌ట‌న‌.. విచార‌ణ‌కు మంత్రి లోకేశ్ ఆదేశం

హిడెన్ కెమెరా ఘటనపై మంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Update: 2024-08-30 06:43 GMT

బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘ‌ట‌న‌.. విచార‌ణ‌కు మంత్రి లోకేశ్ ఆదేశం

Hidden Camera: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. గల్స్ హాస్టల్‌ వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నాడని ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజీకి చేరుకున్న పోలీసులు... పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ లాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వారం కిత్రమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చినా విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో తెల్లవారుజాము 3 గంటల వరకు కాలేజీలో హైడ్రామా కొనసాగింది. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.

హిడెన్ కెమెరా ఘటనపై మంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు మంత్రి లోకేష్.

Full View


Tags:    

Similar News