అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2,56,257 కోట్లు

Update: 2022-03-11 09:00 GMT

అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

Buggana Rajendranath: ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. మొత్తం 2లక్షల 56వేల 257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా 2.08 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా 47వేల 996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా 17వేల 36 కోట్లు, ద్రవ్యలోటు 48 వేల 724 కోట్లుగా పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ పింఛను కింద 61.74 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు అందజేస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా పింఛను మొత్తాన్ని 2వేల 250 రూపాయల నుంచి 2వేల 500 రూపాయలకి పెంచామన్నారు.

పోలవరం నీటి పారుదుల ప్రాజెక్ట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోందన్నారు మంత్రి బుగ్గన. 2023 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో చురుకైన పురోగతితో పాటు పునరావాస, పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయని తెలిపారు. షెడ్యూల్ కులా ఉప ప్రణాళిక కోసం 18వేల 518 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు మంత్రి బుగ్గన. అల్పసంఖ్యాక వర్గాల వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఉపాధి అవకాశాల కోసం రుణ సదుపాయాలను కల్పించడం ద్వారా వారి ఆర్ధిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతోందన్నారు.

Tags:    

Similar News