Botsa Satyanarayana: చంద్రబాబు టిడ్కో పథకంలో ఒక్క ఇళ్లయినా ఇచ్చారా?
Botsa Satyanarayana: క్లీన్ ఆంధ్రప్రేదశ్ ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు రూపొందించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Botsa Satyanarayana: క్లీన్ ఆంధ్రప్రేదశ్ ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు రూపొందించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెత్త పన్నుపై రాద్దాంతం తగదన్నారు. పేదల నుండి పన్ను వసూలు చేయడం లేదని తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించడానికి విపక్షాలు యత్నిస్తున్నాయని చెప్పారు. టిడ్కో పథకంలో ఒక్క ఇళ్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు ఇచ్చారా అని ప్రశ్నించారు బొత్స. టిడ్కో నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ చేసి ప్రభుత్వానికి నాలుగు వందల కోట్లు మిగిల్చాము. టిడ్కో ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కరెంట్, రోడ్‌లు, నీరు, మరుగుదొడ్లు వంటివి చంద్రబాబు నిర్మించకపోవడం వలన లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదార్లుకి అప్పగిస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.