Botsa Satyanarayana: ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకం యథాతథం

Botsa Satyanarayana: రాష్ట్రంలో 4కోట్ల 23 లక్షల మంది పౌరసరఫరాల ద్వారా లబ్ది పొందుతున్నారని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Update: 2022-07-25 10:04 GMT

Botsa Satyanarayana: ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకం యథాతథం

Botsa Satyanarayana: రాష్ట్రంలో 4కోట్ల 23 లక్షల మంది పౌరసరఫరాల ద్వారా లబ్ది పొందుతున్నారని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఒక్క రూపాయికి కేజీ బియ్యం పథకం యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేస్తామన్న మంత్రి బొత్స మధ్యాహ్నం 3 గంటల వరకు డోర్‌ డెలివరీ చేస్తామని, 3 గంటల తర్వాత డిపో వద్ద పంపిణీ చేస్తామన్నారు బొత్స. కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్‌ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Tags:    

Similar News