Andhra Pradesh: అచ్చెన్నాయుడుకు ఉన్న పదవి డమ్మీ పదవి- అవంతి

Andhra Pradesh: టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్స్ పై మంత్రి అవంతీ శ్రీనివాస రావు స్పందించారు.

Update: 2021-06-14 03:30 GMT

అవంతీ శ్రీనివాస రావు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్స్ పై మంత్రి అవంతీ శ్రీనివాస రావు స్పందించారు. అచ్చంన్నాయుడుకు ఉన్న పదవి డమ్మీ పదవి అన్నారు. పార్టీ వ్యవహరం అంతా లోకేష్ చేతుల్లోనే ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా బీసీని ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల భూములు కబ్జా చేసి.. వారిపైనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో విశాఖలో భూములు దోచుకున్నారని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే మూడు రాజధానులకు అనుకూలమా కాదా చెప్పాలన్నారు మంత్రి అవంతి.

అచ్చెన్నాయుడు ఎదో పదవి ఇచ్చారని ఎదోఒకటి మాట్లాడుతున్నాడు. తిరుపతి ఉప ఎన్నికల తరువాత పార్టీ లేదు బోక్క లేదు అన్నాడు. అచ్చెన్నాయుడు కు ఉన్న పదవి డమ్మి పదవి. పార్టీ వ్యవహరం అంతా లోకేష్ చేతుల్లోనే ఉంది. బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే నెక్ట్ ఎన్నికల్లో బిసి అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటీస్తారా? పల్లా 40 ఎకరాలు కబ్జా చేస్తే స్వాదినం చేసుకోవడం తప్పా ఆయన మీద దాడి బలహీన వర్గాల మీద దాడా. బలహీన వర్గాల వారిని వాడుకుంది మీరు. గీతం భూముల స్వాదినం చేసుకున్నాం వారు బలహీన వర్గాల కాదుగా మీ ప్రభుత్వ హయాంలో విశాఖ భూములు దోచుకుటున్నారని స్వయంగా అప్పటి మంత్రే పిర్యాదు చేశారు ఎం చర్యలు తీసుకున్నారు. మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టే మేము తీసుకుంటున్నాము ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే మూడు రాజదానులుకు అనుకూలమా కదా చెప్పండి అని మంత్రి అవంతి అన్నారు.

Tags:    

Similar News