Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్‌తో నీట మునిగిన పంటలు
Michaung Cyclone: దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు
Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను బీభత్సం సృష్టిచింది. పంటలన్నీ నీట మునిగాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షంతో రైతులు తీవ్రంగా నష్టం పోయారు. జిల్లాలో ముఖ్యంగా మిర్చి పంట తీవ్రంగానష్టం వాటిల్లింది. పత్తి, మిర్చి, వరి , మొక్కజొన్న పంటలు భారీ దెబ్బతిన్నాయి.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులును అదుకోవాలని కోరుతున్నారు.. మరోవైపు అమరావతి మండలం పెద్ద మద్దురు వద్ద వాగు పొంగి పొర్లుతుంది.
దీంతో అమరావతి నుంచి విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఊటుకూరు వద్ద కప్పలవాగు పొంగిపొర్లుతుంది..దీంతో క్రోసూరు అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్లలో మిచౌంగ్ తుఫాన్ తో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన వరిపంట వరదలో మునిగిపోయింది. వర్షం ఈదురుగాలులుతో వరిపంట కూప్పకూలిపోయింది. మిర్చి పంట పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది.