ఏపీకి వర్ష సూచన!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ నెల 25,26 తేదిలలో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2020-11-22 15:25 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ నెల 25,26 తేదిలలో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారవచ్చునని పేర్కొంది. ఫలితంగా 25,26 తేదిల్లో కోస్తాంద్రలో పలుచోట్లలో సాధారణం నుండి భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  

Tags:    

Similar News