Andhra Pradesh: రాయలసీమ, దక్షిణ కోస్తాకు మరో వర్ష గండం
*పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యూలేషన్ *రాబోయే 4,5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలే ఛాన్స్
Andhra Pradesh: ఏపీలో కురిసిన వర్షాలు రాయలసీమ జిల్లాలను వణికించాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఏపీకి మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. రాయలసీమ, దక్షిణ కోస్తాకు మరో వాన గండం ఉందని తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యూలేషన్ ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 4,5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 26, డిసెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదే సమయంలో చురుగ్గా కదలనున్న రుతుపవనాల కారణంగా రాయలసీమ, దక్షిణకోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణశాఖ.