Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డికి గుండెపోటు సంకేతాలు ముందే అందాయా..?
Mekapati Goutham Reddy: గుండెపోటుతో కన్నుమూసిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి గుండె పోటు సంకేతాలు ముందే అందాయా?
Mekapati Goutham Reddy: గుండెపోటుతో కన్నుమూసిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి గుండె పోటు సంకేతాలు ముందే అందాయా? గుండెపోటు లక్ష్యణాలు ముందే కనిపించాయా..? ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకునే గౌతమ్ రెడ్డి గుండె సంబంధ సమస్యను నిర్లక్ష్యం చేశారా..? కరోనా ప్రభావం గుండె పోటుకు దారి తీసిందా..? గౌతం రెడ్డి మరణం తర్వాత ఇలాంటి చర్చే జరుగుతోంది.
ఇటీవల దుబాయ్ ఇండస్ట్రియల్ ఎక్స్ పోకు హాజరైన మంత్రి గౌతమ్ రెడ్డి ఛాతీలో నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. నొప్పిని అదిమి పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది కుడి చేత్తో చాతీ పై రుద్దుకోవడం స్పష్టంగా చూడవచ్చు.. అది కూడా గుండెపై రుద్దుకోవడం కనిపిస్తోంది.. అది గుండె పోటుకు సంబంధించిన సమస్యే అయి ఉంటుందంటూ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకునే గౌతంరెడ్డి గుండెను నిమురుకుంటూ కనిపించిన వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా శ్వాస సంబంధమైన సమస్య కొంత ఉన్నట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలో వ్యాయామం చేసినప్పుడు ఎక్కువగా అలసిపోవడం తలనొప్పి రావడం తరచుగా జరుగుతోందని నిత్యం వెంట ఉండే అనుచరులు చెప్తున్నారు. అయితే పని ఒత్తిడి వల్లే ఈ సమస్యలు వస్తుండొచ్చు అనుకున్నామని తమ నాయకుడికి ఇంత పెద్ద సమస్య ఉన్నట్లు ఊహించలేకపోయామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వంశపారం పర్యంగా చూసుకున్నా గౌతమ్ రెడ్డి కుటుంబంలో ఎవరికీ గుండెపోటు లేదని అందుకే ఆ సమస్యపై కుటుంబ సభ్యులు ఎక్కువ దృష్టిపెట్టలేదని సమాచారం. గౌతమ్ రెడ్డికి గడిచిన రెండేళ్లలో మూడుసార్లు కరోనా సోకింది.. పోస్ట్ కోవిడ్ కారణంగానే గుండెపోటుకు దారితీసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 11నుంచి 17 వరకు జరిగిన దుబాయి ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. పలు కీలక ఒప్పందాలపై అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.