Tirumala: భారీ వర్షంకు తిరుమలలో నేలకొరిగిన చెట్లు.. బలమైన ఈదురుగాలులు
Tirumala: నాలుగు వాహనాలు ధ్వంసం.. ప్రమాద సమయంలో భక్తులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
Tirumala: మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తిరుమలపై భారీగా చూపింది. గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తిరుమలలోని ఏఎన్సి కాటేజ్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయంతో పాటు పాంచజన్యం అతిధి గృహం వద్ద భారీ వృక్షాలు నెలకొరిగాయి. పాంచజన్యం వద్ద చెట్టు నేలకొరగడంతో నాలుగు వాహనాలు ధ్వంసం కాగా.. భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఘటనా స్థలానికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది..నేలకొరిగిన భారీ వృక్షాన్ని కట్టర్ల సహాయంతో తొలగించారు. తుపాన్ కారణంగా తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పాపవినాశనం మార్గంలోని పలు ప్రదేశాల్లో చెట్లు కూలి పోవడంతో పాపవినాశనంకు భక్తుల అనుమతిని రద్దు చేసింది.. వీటితో పాటుగా సందర్శనీయ ప్రదేశాలైన శ్రీపాదాలు, శిలాతోరణంకు భక్తుల అనుమతిని టిటిడి రద్దు చేసింది.