Marriages in Corona Pandemic: పెళ్లి బాజా మోగాలంటే ఇక తహశీల్దార్ అన్తుమతి ఉండాల్సిందే!
Marriages in Corona Pandemic: కరోనా విలయంలో ఏ పని చేసినా దానికి నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Marriages in Corona Pandemic: కరోనా విలయంలో ఏ పని చేసినా దానికి నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందలంటూ షరతులు విధించింది. అయితే పెళ్లి విషయంలో గతంలో కలెక్టర్లకు భాద్యత అప్పగించగా అవసరమైన అనుమతి పొందేందుకు కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా ఈ బాద్యతను తహశీల్దార్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి పెళ్లిళ్లకు అనుమతి పొందాల్సి వచ్చేది. అయితే ఆ ప్రక్రియ కాస్తా ఆలస్యం అవుతుండటంతో.. మండల పరిధిలోని స్థానిక తహసీల్డార్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జూలై 21 నుంచి శ్రావణ మాసం మొదలు కానుండటంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని.. మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. వధువు- వరుడు తరుపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పెళ్ళికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్డార్‌కు సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తీసుకుంటామని జగన్ సర్కార్ జీవోలో పేర్కొన్నారు.