Lockdown in Kakinada and Bhimavaram: నేటి నుంచి ఆ రెండు పట్టణాల్లో లాక్ డౌన్.. కేసులు పెరగడంతో చర్యలు

Lockdown in Kakinada and Bhimavaram: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రారంభంలో దేశం మొత్తం విధించిన లాక్ డౌన్ క్రమేణా అన్ లాక్ గా మార్చారు.

Update: 2020-07-13 05:15 GMT
Lockdown in Kakinada and Bhimavaram

Lockdown in Kakinada and Bhimavaram: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రారంభంలో దేశం మొత్తం విధించిన లాక్ డౌన్ క్రమేణా అన్ లాక్ గా మార్చారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు అనుగుణంగా స్థానిక పరిస్థితులను బట్టి, స్వచ్ఛందంగా లాక్ డౌన్లు విధించుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాకినాడ, బీమవరంలలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుని, నేటి నుంచి అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు మరోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో ఇవాళ్టి నుంచి మళ్లీ లాక్ డౌన్ అమలు చేయనున్నారు.

తూర్పుగోదావరిలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాజమండ్రి, కాకినాడతో పాటుగా జిల్లాలోని ఇతర పట్టణాలు, మండలాల్లో కూడా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు ఇవాళ్టి నుంచి కాకినాడలో తిరిగి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించగా.. ఆ తర్వాత కేవలం నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులు మాత్రమే ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి జనాలు వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

అటు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ్టి నుంచి పట్టణంలో ఆటోలు తిరిగేందుకు అనుమతి లేదన్న ఆయన.. షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 వరకు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. అలాగే పట్టణం నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కూరగాయలు, చేపల మార్కెట్‌లను మూసి వేస్తున్నామన్నారు. కాగా, స్థానిక ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే మద్యం విక్రయించాలని అన్నారు. 

Tags:    

Similar News