ఏపీలో పొలిటికల్‌ హీట్ పెంచుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు

ఎన్నికలకు ప్రతి పక్షం సై .. అధికార పక్షం నై

Update: 2020-11-23 04:59 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రోజు రోజుకు పొలిటికల్ వేడి ముదురుతోంది. ప్రతిపక్షాలు ఎన్నికలపై సై అంటుంటే.. అధికార పక్షం నై అంటోంది. కరోనా కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది రాష్ట్రంలో విసృతంగా చర్చ జరుగుతోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాలుకు మాటల యుద్ధం జరుగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేశ్ టీడీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాదులోని హోటల్ లో టీడీపీ వ్యక్తులతో నిమ్మగడ్డ మీటింగ్ పెట్టారని విమర్శించారు.

ఏపీలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం దృష్టి పెడతుంటే ఎన్నికల కమిషనర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రెండో దశ కోవిడ్ విజృంభిస్తుంటే ఎన్నికలు పెడతామని ఈసీ అంటోందని ధ్వజమెత్తారు.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇరు వర్గాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలపై హీట్ పెరుగుతోంది. దీనికి భిన్నంగా స్టేట్ ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది..




Tags:    

Similar News