DCP Vishal Gunni: లోన్ యాప్‌లను ప్రజలు నమ్మొద్దు
DCP Vishal Gunni: బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవాలి
DCP Vishal Gunni: ఇటీవల లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులతో మరణించిన ఆటోడ్రైవర్ మణికంఠ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముంబై, కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌కు 5 ప్రత్యేక బృందాలను పంపిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వండర్ అనే యాప్ నుంచి ఆటోడ్రైవర్ మణికంఠ లోన్ తీసుకున్నట్లు వివరించారు. లోన్ యాప్‌లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మరాదని.. బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవాలని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు.