Mansukh Mandaviya: ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్.. BSL-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన
Mansukh Mandaviya: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మన్సుఖ్ మాండవీయ
Mansukh Mandaviya: ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటిస్తున్నారు. నేడు విజయవాడలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజినితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో 10 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆస్పత్రుల్లో సరిపడా... డాక్టర్లు ఉండాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామన్న ఆయన.. మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఏపీలో బాగా పనిచేస్తోందన్న మన్సుఖ్ మాండవీయ రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి స్ధాయి మద్దతు ఉంటుందన్నారు.
కేంద్రం ఇస్తున్న సహకారానికి మంత్రి విడదల రజిని అభినందనలు తెలిపారు. పీఎం ఆయుష్మాన్ భారత్ ప్రజలకు చాలా ఉపయోగకరమైన పథకమన్నారు. బీఎస్ఎల్- 3 ల్యాబ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆమె... సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో అనేక పథకాలు చేపట్టామన్నారు.