Krishna Board Letter to AP Govt: జగన్ సర్కార్‌కు షాక్.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ!
Krishna Board Letter to AP Govt: రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు పై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Krishna Board Letter to AP Govt: రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు పై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపడుతోందని పేర్కొంది. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కృష్ణా బోర్డుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ నివేదికను అపెక్స్ కౌన్సిల్ కు పంపాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా చెప్పారు. మేరకు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ పంపారు.
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లకు నోటిఫికేషన్ ను కూడ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు కడితే.. తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లో కనీసం మంచినీటి ప్రాజెక్టులకు కూడ నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందనీ. దీంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని మండిపడుతోంది. ఈ విషయమై ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
మరో వైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జలవనరులశాఖపై ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.