Kodali Nani: సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన కొడాలి నాని..

Kodali Nani: కొత్తగా ఏర్పాటైన ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ చైర్మన్ నియామకాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని సున్నితంగా తిరస్కరించారని సమాచారం.

Update: 2022-04-17 10:14 GMT

Kodali Nani: సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన కొడాలి నాని..

Kodali Nani: కొత్తగా ఏర్పాటైన ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ చైర్మన్ నియామకాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని సున్నితంగా తిరస్కరించారని సమాచారం. పార్టీ భారీ మెజారిటీ గెలుపు కోసం తనకి ఎటువంటి బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. 24 మందితో పాటు జగన్ కేబినెట్ నుండి కొడాలి తొలగించబడ్డారు.

అయితే కొత్త మంత్రివర్గంలో కొడాలి పేరు కూడా ఉండొచ్చని ప్రచారం జరిగినా, చివరి క్షణంలో కొని ఈక్వషన్స్ లో భాగంగా ఆయన పేరును పక్కనబెట్టారు. కొడాలి నాని పవర్ ఏ మాత్రం తగకుండా ఆయనను ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. మంత్రి, ప్రొటోకాల్‌తో కూడిన అన్ని సౌకర్యాలతో కూడిన క్యాబినెట్ హోదా కల్పిస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే, కొడాలి నాని పదవిని స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదని, అదే విషయాన్ని ఆయన జగన్‌కు మర్యాదపూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తుంది.

Full View


Tags:    

Similar News