Anakapalle: పొలాల్లో కింగ్ కోబ్రా కలకలం...
Anakapalle: గిరినాగును పట్టుకుని అడవిలో వదిలిన అటవీ సిబ్బంది
Anakapalle: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో భారీ గిరినాగు కలకలం రేపింది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు పామును చూసి పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. విశాఖ నుంచి వన్యప్రాణి సంరక్షకుడు మూర్తి బృందం తురువోలు చేరుకుంది. గంట పాటు శ్రమించి 13 అడుగులకు పైగా పొడవున్న గిరినాగును పట్టుకుని అటవీలో వదలిపెట్టారు.