YS Viveka: వివేకా కుమార్తె ఫిర్యాదుతో కదిలిన కడప యంత్రాంగం
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సునీత రాసిన లేఖపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు.
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సునీత రాసిన లేఖపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. వివేకా ఇంటి వద్ద తక్షణమే శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే లేఖలో సునీత ఫిర్యాదు చేయబడిన అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని సూచించారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారిని అదేశించారు.
ఆగస్టు 10న ఓ వ్యక్తి తమ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడని ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు వైఎస్ సునీత. ఆ వ్యక్తిని మణికంఠగా గుర్తించామని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలో మణికంఠ ఫోటో ఉందని తెలిపారు. వైఎస్ హత్యకేసులో ప్రధాన అనుమానితుడిగా దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఉన్నారన్నారు. మణికంఠ దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి అనుచరుడని లేఖలో తెలిపారు సునీత. రెక్కీ వెనుక వాస్తవాన్ని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు.