Pawan Kalyan: ఇవాళ మంగళగిరికి జనసేన అధినేత రాక
Pawan Kalyan: జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో 2014లో పురుడు పోసుకున్న జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి అడుగులు వేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన అబ్యర్ధి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ వైసీపీ కండువ కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉనికి చాటుకున్నప్పటికీ భవిష్యత్ ఏంటనేది అందరిలో ఆసక్తి నింపుతోంది. రాజకీయా వర్గాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన కీలకంగా మారుతుందంటూ మరోసారి జనసేన వార్తల్లో నిలుస్తుంది. మంగళకగిరి పార్టీ కార్యాలయంలో ఇవాళ విస్తృత స్థాయి సమావేశం జరనున్నది. పవన్ కల్యాణ్ అధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు. రాష్ర్టంలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంపై ఎన్నో అంచనాలు కనిపిస్తున్నాయి.
2019 ఎన్నికల తర్వాత జనసేనానికి రాజకీయాలకు దూరంగా ఉంటారు.. అన్న బాటలోనే సినిమాలకు పరిమితం అవుతారన్న విమర్శలకు చెక్ పెడుతూ రాజకీయాల్లో తన ప్రస్తానాన్ని కొసినాగిస్తూ వచ్చారు. అధికార పార్టీ వైసీపీపై ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పార్టీ ఆవిర్భావ ధినోత్సవం సందర్భంగా వైసీపీ సర్కార్ పై యుధ్ధం ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఓ వైపు వైసీపీ పాలన మూడేళ్లు పూర్తి చేసికున్న సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం. సామాజిక న్యాయ భేరీతో బస్సు యాత్ర చేపట్టిన తమ పాలపైన ప్రజల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. టీడీపీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లారు. ఇటీవల రెండు రోజులపాటు మహానాడు కార్యక్రమం చేసుకని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఏపీలో పొత్తులపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాష్ర్ట రాజకీయాలపై చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీతో, టీడీపీతొ పొత్తులపై చర్చిస్తూనే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాలిక అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేయనున్నారు. టీడీపీతో కలిసి ముందుకు నడుస్తారా.. లేదా బీజేపీతో కలిసి అడుగులో అడుగు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇవాళ జరగనన్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది సర్వత్ర ఆసక్తి కనబరుస్తోంది. జనసేన విస్తృత స్థాయి లసమావేశం విస్తృతంగా జరిగేనా.. పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్నలకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాదానం చెబుతారో వెయిట్ చేయాల్సి ఉంది.