Pawan Kalyan: చిరంజీవి నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి నివాసానికి పవన్

Update: 2024-06-06 12:54 GMT

Pawan Kalyan: చిరంజీవి నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా చిరంజీవి ఇంటికి వెళ్లారు జనసేనాని. పవన్ రావడంతో మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికారు. రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఇంట్లో నుండి వస్తూనే పవన్ ను ఆలింగనం చేసుకొనేందుకు చిరంజీవి ప్రయత్నించారు.

అయితే పవన్ కళ్యాణ్ తొలుత చిరంజీవి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్దపూలదండను వేసి పవన్ కళ్యాణ్ ను అభినందించారు చిరంజీవి. జనసేన ఘన విజయం సాధించినందుకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది జనసేన. వందశాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

Also Read: Akira Nandan: నాన్నకు ప్రేమతో.. పవన్ జర్నీపై అకీరా స్పెషల్ వీడియో..  


Full View


Tags:    

Similar News