Pawan Kalyan on New Education Policy: నూతన విద్యా విధానంపై పవన్ కల్యాణ్..
Pawan Kalyan on New Edcation Policy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు సమస్యలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan on New Edcation Policy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు సమస్యలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే 2019లో ప్రస్తుతం విద్యార్థులకు నూతన విద్యా విధానం అవసరమని, వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇస్తే వారు జీవితంలో జీవనోపాధి పెంచుకునే విధంగా తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. ఇదే వీడియోను కేంద్ర మంత్రి తిరిగి ట్టిట్టర్ లో పోస్టుచేసి, పవన్ ఆలోచనల మేరకు నూతన విద్యా విధానం రూపుదిద్దుకుందని చెప్పుకొచ్చారు.
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానాన్ని జనసేన అధినేత స్వాగతించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి ధన్యవాదలు తెలియజేశారు. 2019లో పవన్ చెప్పిందే పరిగణలోకి తీసుకొని ఇప్పడు కేంద్రం అమలు చేసిందని ఓ వీడియోను పోస్ట్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్.
ఆ వీడియోలో 2019 ఏప్రిల్ నెలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఒకేషనల్, చేతి వృత్తి, కళా సంబంధమైన కోర్సుల గురించి మాట్లాడారు. "చదువుకునే సమయంలో తనకు ఏదైనా చేతి వృత్తులకు సంబంధించిన కోర్సులు నేర్చుకోవాలని ఉండేదని, కానీ కుదరలేదని, తనలాగే చాలా మంది విద్యార్థులకు చదువుతోపాటు ఒకేషనల్ కోర్సులు, చేతివృత్తి కోర్సులు చేయాలని ఉంటుందని ఆ సమావేశం అన్నారు."
ఈ వీడియోను కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి, వృత్తి, ఒకేషనల్, కళా సంబంధమైన విద్యల విషయంలో పవన్ ఆలోచనలను పరిగణలోకి తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన ఒకేషనల్ కోర్సుల సంబంధమైన కోర్సులను ఎంపిక చేసుకునే విధంగా విద్యా విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు.