నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రైతులకు ఎకరాకు 35 వేల రూపాయల పరిహారం చెల్లించాలంటూ ఈనెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ విస్మరించిందన్నారు.
రాజధానిగా అమరావతి ఉండాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై పార్టీలో చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు మేలు కోరే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకు వస్తుందని రైతులకు ఇబ్బందికరంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలలో సవరణలు చేస్తున్నారని నాదెండ్ల చెప్పారు. మార్చి నాటికి జనసేన క్రీయశీలక సభ్యత్వాలు స్వీకరణ పూర్తి చేస్తామన్నారు.