Jana Sena: పొలిటికల్ యాక్షన్ షురూ చేయనున్న జనసేనాని

రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో సమావేశాలు ముందుగా కార్యకర్తలతో జనసేనాని ముఖాముఖి రేపు ఉదయం 11గంటలకు కోవిడ్ మృతులకు సంతాపం

Update: 2021-07-06 15:50 GMT

పవన్ కళ్యాణ్ 

Janasena: ఇకపై తగ్గేదే లేదు.. ప్రజా సమస్యలపై ఆగేదే లేదు ప్రశ్నించేలోపే పనైపోవాలి.! ఏ మాత్రం తేడా వచ్చినా సమరమే.. ఏంటీ ఈ సినిమా డైలాగులు అనుకుంటున్నారా..? వినడానికి రీల్ డైలాగ్స్‌లా ఉన్నా రేపటి నుంచి రియల్‌గా జరగబోయేది ఇదే అంటుంది జనసైన్యం.! కొంతకాలం గ్యాప్‌ తర్వాత జనసేనాని పొలిటికల్ యాక్షన్‌కి సర్వం సిద్ధమైన వేళ జనసైనికుల్లో ఫుల్‌ జోష్ కనిపిస్తోంది.!

గత కొంత కాలంగా మూవీ షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపిన జనసేనాని పొలిటికల్ యాక్షన్ షురూ చేయబోతున్నారు. రేపటి నుంచి క్షేత్రస్థాలో రంగంలోకి దిగబోతున్నారు. రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో వరుస సమావేశాలు నిర్వహించనున్న జనసేనాని తాజా రాజకీయ పరిణామాలపై క్షేత్రస్థాయిలో చర్చించనున్నారు. అలాగే, నిరుద్యోగులు, భవనకార్మికులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు తిరుపతి బైపోల్ తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా గడిపిన జనసేనాని వైసీపీ సర్కార్‌పై నేరుగా సమర శంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కార్యకర్తలు, నేతలతో రేపటి నుంచి వరుస భేటీలు చేయనున్నట్లు సమాచారం. అటు పవన్ ఎంట్రీతో జనసైనికుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను జనసేనానికి వివరించేందుకు సిద్ధమైయ్యారు.

ముఖ్యంగా నిరుద్యోగంపై జగన్ సర్కార్‌ను నిలదీసేందుకు జనసేనాని ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ముందుగా నిరుద్యోగులతో చర్చించనున్నారు. అనంతరం నిరుద్యోగ సమస్యలపై జగన్ సర్కార్‌ను నేరుగా టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మొదటి నుంచీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఫైట్ చేస్తున్న జనసేనాని రేపు కూడా ఇదే అంశంపై కీలక చర్చ నిర్వహించనున్నారు. లాంగ్‌మార్చ్ వంటి పోరాటాలు చేసినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదని కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపధ్యంలో కార్మిక సంఘాలతో భేటీ కానున్న పవన్.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News