YS Jagan: జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం
YS Jagan: చదువుకు పేదరికం అడ్డు కాకూడదు
Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని, మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారాయన ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని, మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఏపీ సీఎం జగన్ ఆకాక్షించారు. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చామని, పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు జగన్ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని, వీరికి తొలివిడతగా 19 కోట్ల 95 లక్షల సాయం అందిస్తున్నామన్నారు.
అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్యను అందిస్తున్నామని, అంతర్జాతీయ స్థాయిలో టాప్-200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయం 19 కోట్ల 95 లక్షల రూపాయలను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జమ చేశారు.