Pawan Kalyan: ముఖ్యమంత్రిగా పవన్ చేసే మొదటి పని ఇదేనా.. నెట్టింట వైరల్ గా పవన్ శంకుస్థాపన పిక్..

Pawan Kalyan: ఈ ఫోటో సారాంశం ప్రకారం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతున్నాడని జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు.

Update: 2023-05-10 09:10 GMT

Pawan Kalyan: ముఖ్యమంత్రిగా పవన్ చేసే మొదటి పని ఇదేనా.. నెట్టింట వైరల్ గా పవన్ శంకుస్థాపన పిక్..

Pawan Kalyan: ఏపీలో రోజు రోజుకు ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం పోటీపడుతున్నాయి. 175 స్థానాలపై కన్నేసిన వైఎస్ జగన్ ఒకవైపు, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని చంద్రబాబు మరోవైపు, ఒక్క ఛాన్స్ అంటూ మొదటిసారి అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్ ఇంకో వైపు.. ఇలా మూడు పార్టీల అధినేతలు వేస్తోన్న ప్రణాళికలు ఎన్నికల సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కౌలు రైతులకు భరోసా, జనవాణి పేరిట ప్రజా సమస్యల పరిష్కారం ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలమధ్య ఉంటూ పవన్.. ఏపీ రాజకీయాల్లో భవిష్యత్ లో జనసేన పోషించే పాత్రను స్పష్టంగా చెప్పకనే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేదా ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా జనసేన ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా పవన్ చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సన్నద్ధంగా ఉండాలంటూ పవన్ పిలుపునివ్వడంతో ఆ పార్టీలో నయా జోష్ తొళికిసలాడుతోంది. 2014లో ఆరుగురు కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమైన తమ పార్టీ ఇప్పుడు 76కు చేరిందని పవన్ చెప్పారు. అలాగే పార్టీ కార్యకర్తల బలం 3.26 లక్షలకు పెరిగిందన్నారు.

ఇక అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన ఓట్ షేర్ 7 శాతం నుంచి ప్రస్తుతం 35 శాతానికి పెరిగిందని చెప్పారు. ఇందులో నిజానిజాలను పక్కనపెడితే జనసేన మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ సీఎం అవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ.. రాజవారసత్వం నశించినయ, ప్రజారాజ్యం విరసిల్లునయ.. తప్పదు నా మాట నమ్మండయ అని రాసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో సారాంశం ప్రకారం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతున్నాడని జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటోను మర్చిపోకముందే ఓ ఆసక్తికర పిక్ నెటిజన్స్ ను తెగ ఆకర్షిస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సర్వేపల్లి కాలువపై మిని బైపాస్ రోడ్డు మరియు బాలాజీ నగర్ లను కలిపే బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలకంలో నిర్మాణ పనులను వచ్చే సార్వత్రిక ఎన్నికలు అనంతరం ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ పూర్తి చేస్తారని ఉంది. ఈ మేరకు శిలాఫలకానికి జనసేన నెల్లూరు నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి శంకుస్థాపన చేసినట్లుగా ఉంది.

ప్రస్తుతం ఈ శిలాఫలకం చిత్రం నెట్టింట వైరల్ గా మారింది. అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల వేళ రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం సాధారణ విషయమే అయినా.. ఏపీ రాష్ట్రానికి పవన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ బలమైన విశ్వాసానికి తాజా శిలాఫలకమే నిదర్శనమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News