జనసేన, బీజేపీల మధ్య పొత్తు కంటిన్యూ అయ్యేనా..?
BJP - Janasena: క్షేత్రస్థాయిలో టీడీపీతో కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్న జనసైనికులు...
BJP - Janasena: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా.. విపక్షాలు మాత్రం ముందస్తు తప్పవంటున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు జనసేన, బీజేపీల మధ్య పొత్తు కంటిన్యూ అవుతందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి.
2019 ఎన్నికలకు ఎవరికి వారే విడివిడిగా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ, జనసేన దోస్తీ కట్టాయి. కానీ మూడేళ్లుగా ఆ రెండు పార్టీలు కలిసి పోరాటం చేసిన కార్యక్రమాలు కొన్నే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన కార్యకర్తలు కలిసి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికలో గ్యాప్ స్పష్టంగా కనిపించింది. ఇక క్షేత్రస్థాయిలో టీడీపీతో కలిసి పనిచేసేందుకు జనసైనికులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
అసలు ఎవరితోనూ మనకు పొత్తు వద్దని కొంతమంది పార్టీ నేతలు చెప్తంటే.. అధినేత పవన్ ఇచ్చిన క్లారిటీతో నేతలు మిన్నకుండిపోయారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ ఘంటాపథంగా చెప్తున్నారు. పొత్తులు తప్పవని జనసేనాని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే అవి ఎలా ఉంటాయో తెలియక హస్తిన వైపు ఆశగా చూస్తున్నారు కమలం నేతలు. జనసేనతో కలిసి వెళ్లేందుకు కొంతమంది బీజేపీ నేతలు ఇష్టపడటంలేదని తెలుస్తోంది. పొత్తులపై హై కమాండ్‌దే తుది నిర్ణయమని కుండబద్దలు కొడుతున్నారు. మరి ఢిల్లీ పెద్దల రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది..? వైసీపీ అధినేత జగన్.. ప్రధాని మోడీతో జరుపుతున్న భేటీలు ఈ రోడ్ మ్యాప్‌పై ప్రభావం చూపుతాయా..