రాయలసీమకు ప్రమాద హెచ్చరిక.. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ

* పది రోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు * బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం * ఎల్లుండి అండమాన్ తీరంలో మరో అల్పపీడనం

Update: 2021-11-27 14:45 GMT

కోస్తాంధ్ర, రాయలసీమపై అల్పపీడన ఎఫెక్ట్(ఫైల్ ఫోటో)

Rayalaseema: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన రాయలసీమకు మరో గండం పొంచి ఉంది. రాయలసీమలో మరోసారి భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరిచింది. పది రోజుల గ్యాప్‌లో రెండు అల్పపీడనాలు సీమను టెన్షన్ పెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఎల్లుండి అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.

దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరులో ఉదయం నుంచీ వర్షం దంచికొట్టింది. ఇక అల్పపీడన ప్రభావం రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు వాన గండం ఉటుందని ఐఎండీ ప్రకటించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికీ కోలుకోని సీమ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Tags:    

Similar News