Srisailam Hundi: శ్రీశైలం బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు.. రూ.5 కోట్ల, 16లక్షల, 84వేల నగదు రాబడి
Srisailam Hundi: బంగారు 122 గ్రాములు.. వెండి 5 కేజీల 900 గ్రాములు
Srisailam Hundi: శ్రీశైలంలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల హుండి లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. అక్కమహాదేవి అలంకార మండపంలో సీసీ కెమెరాల మధ్య పకడ్బందీగా నిర్వహించగా... ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 16 లక్షల 84 వేల 417 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈఓ తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 13 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయాధికారులు వెల్లడించారు.
ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు బంగారు 122 గ్రాముల 400 మిల్లీగ్రాములు లభించిగా... వెండి 5 కేజీల 900 గ్రాములు, యు.ఎస్. ఏ డాలర్లు- 240, సింగపూరు డాలర్లు- 25, ఆస్ట్రేలియా డాలర్లు--30, యూకే పౌండ్స్-30, యూఏఈ ధీరమ్స్-20 హుండి లెక్కింపులో లభించాయని ఈఓ తెలిపారు. వాటితోపాటు పలు విదేశీ కరెన్సీలు స్వామి అమ్మవార్ల హుండీలో భక్తులు సమర్పించారన్నారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం అధికారులు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగిందని దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.