ఏపీలో ఉచిత ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ స్కీమ్: ఎలా దరఖాస్తు చేయాలి?

Free Gas Cylinders: దీపావళి నుంచి ఉచిత ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు ప్రకటించారు.

Update: 2024-10-30 08:21 GMT

Free Gas Cylinders In Andhra Pradesh: దీపావళి నుంచి ఉచిత ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద అక్టోబర్ 29 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఏటా మూడు సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఫస్ట్ సిలిండర్ కోసం 2025 మార్చి 31 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. చివరి సిలిండర్ ను 2025 నవంబర్ 30 లోపుగా అప్లయ్ చేయాలని సివిల్ సప్లయిస్ అధికారులు చెప్పారు.

తెల్ల రేషన్ కార్డు ఉండాలి

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు, ధరఖాస్తుదారుడి పేరున ఎల్ పీ జీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పై వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై 14 రూపాయాల నుంచి 25 రూపాయాల వరకు సబ్సిడీని జమ చేస్తోంది.

ఎలా బుక్ చేసుకోవాలి?

ఎప్పటి మాదిరిగానే ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాలి. బుక్ చేసిన 24 గంటల్లో గ్రామాల్లో సిలిండర్ డెలివరీ అవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రెండు రోజుల్లో డెలివరీ అవుతోంది. గ్యాస్ సిలిండర్ డెలీవరి చేసిన సమయంలో డెలివరీ ఏజంట్ డబ్బులు తీసుకొంటే రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో రూ. 851 జమ చేస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.2,684.75 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోనేవారు తమ ఎల్ పీ జీ గ్యాస్ డీలర్ వద్ద ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారం లోపుగా అప్ డేట్ అవుతుంది. కేవైసీ పూర్తి చేసిన తర్వాత అప్ డేట్ కాకముందే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయితే దానికి డబ్బులు చెల్లించాలి. కేవైసీ పూర్తైన తర్వాతే లబ్దిదారుడు డబ్బులు చెల్లించినా వారి ఖాతాల్లో ప్రభుత్వం తిరిగి నగదును జమ చేస్తోంది.

Tags:    

Similar News