Godavari River: గులాబ్ తుఫాన్ ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం
Godavari River: ఎగువన నుంచి భారీగా వరద నీరు
Godavari River: బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దాంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం దగ్గర గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. నిన్న సాయంత్రం 31.4 మీటర్ల దగ్గర స్థిరంగా కొనసాగిన వరద ఉధృతి ఉదయానికి ఒక్కసారిగా పెరిగింది.
దాంతో కాపర్ డ్యామ్ దగ్గర వరద ఉధృతి 32.5 మీటర్లకు చేరింది. ఒక్కరాత్రిలోనే ఒక మీటరు వరద నీరు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి పెరగడంతో పోలవరం స్పిల్ వే 48 గేట్ల ద్వారా 5.19 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.. మరోవైపు.
భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో రాత్రికి మరింత వరదవచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.