School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈరోజు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్

School Holidays: ఏపీలోని పలు జిల్లాల స్కూల్లకు నేడు కూడా పాఠశాలలకు సెలవు ఉంది. ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. ఏయే ప్రాంతాల్లో సెలవు ఉందో తెలుసుకుందాం.

Update: 2024-09-10 02:12 GMT

 School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈరోజు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్

School Holidays: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి. వరద దెబ్బకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే విద్యార్థుల సేఫ్టీని పరిగణలోనికి తీసుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ సెలవు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తుంది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాఠశాలలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. సోమవారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు.

అటు ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, ఏలూరు మండలాల్లోని పలు స్కూళ్లకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా పాఠశాలలు మామూలుగానే పనిచేస్తాయి. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వర్షాలు పడుతున్ననేపథ్యంలో అవసరం ఉంటేనే బయలకు రావాలని తెలిపింది.


Tags:    

Similar News