ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

AP Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం

Update: 2022-09-08 07:33 GMT

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

AP Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి వరకూ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన జాలర్లు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లాలోని 28 మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా పంట, ఆస్తినష్టం జరిగింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఏకధాటిగా వాన దంచి కొట్టింది. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News