Tirumala: మండూస్ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు..
Trimula: శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ
Trimula: భారీ వర్షాలకు తిరుమల కొండ తడిసి ముద్దవుతోంది. మండూస్ తుఫాను ప్రభావంతో తిరుమల కొండ పైన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో.. టీటీడీ కలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండ పైన కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. భక్తుల రాకపోకల పైన తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది. మెట్ల మార్గం పైన ప్రత్యేకంగా నిఘా పెట్టింది. మెట్ల మార్గంలో పరిస్థితికి అనుకూలంగా భక్తుల రాకపోకల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మెట్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో భక్తులను అనుమతించడంలేదు. ప్రవాహం తగ్గిన తర్వాత భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు తిరుమల జలాశయాలకు నీటి ఉధృతి పెరిగింది. పాపవినాశం డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.