Cyclone Michaung: తీవ్ర తుపానుతో అప్రమత్తమైన ఏపీ సర్కార్.. 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
Cyclone Michaung: 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
Cyclone Michaung: తీవ్ర తుపానుతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. 8 జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీలోని 9 జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. అన్నమయ్య, తిరుపతి, నంద్యాల, అనకాలపల్లి, విశాఖ, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రభుత్వం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తుపాను వల్ల బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీరం వెంబడి గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. వాయవ్యదిశగా గంటకు 7 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది. ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య..బాపట్ల దగ్గర తీరం మిచౌంగ్ తుపాను తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.