రానున్న రెండ్రోజుల్లో భారీ వర్ష సూచన... బంగాళాఖాతంలో అల్పపీడనం...

Weather Forecast Today: రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్...

Update: 2022-03-03 01:27 GMT

రానున్న రెండ్రోజుల్లో భారీ వర్ష సూచన... బంగాళాఖాతంలో అల్పపీడనం...

Weather Forecast Today: దక్షిణమధ్య బంగాళా‍ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రానికి ఆనుకొని కొనసాగుతుందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఆ తర్వాతి 24 గంటల్లో తమిళనాడు తీరానికి చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది. ఇక.. అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

Tags:    

Similar News