Heavy Rains: ఏపీకి 24 గంటల వర్ష సూచన.. తమిళనాడులో 14 మంది మృతి

Heavy Rains: *తీరాన్ని దాటిన వాయుగుండం *క్రమంగా బలహీనపడే అవకాశం

Update: 2021-11-12 02:00 GMT

Heavy Rains: ఏపీకి 24 గంటల వర్ష సూచన.. తమిళనాడులో 14 మంది మృతి

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తీరం దాటిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ వెల్లడించింది. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ జారీ చేసిన హెచ్చరికను ఐఎండీ సవరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికగా మార్పు చేసింది. తమిళనాడులోని ఇతర జిల్లాల్లోనూ ఇవాళ్టి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది.

ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మరణించారు. చెన్నై నగరంలో ఇప్పటికీ నీరు తొలగిపోలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు నిలిచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 12 సబ్ వేలను మూసివేశారు. అటు చెన్నై ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిలిపివేశారు.

Tags:    

Similar News