బంగాళాఖాతంలో అల్పపీడనం ... తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Weather Update: కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2022-08-06 03:33 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం ... తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్లు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా, ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు విశా‌ఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Tags:    

Similar News