Chandrababu: స్కిల్ కేసులో బాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: బాబు బహిరంగ వ్యాఖ్యలు చేయరాదన్న సుప్రీంకోర్టు

Update: 2023-11-28 14:20 GMT

Chandrababu: స్కిల్ కేసులో బాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ 

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దుపై బాబుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో 17 ఏ పై తీర్పు వచ్చిన తరువాత బాబు బెయిల్ రద్దు కేసు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.... చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని సుప్రీం కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.. కానీ సీఐడీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

మధ్యంతర బెయిల్‌పై హైకోర్టు షరతులు కొనసాగించాలని సీఐడీ వేసిన మరో అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఇరుపక్షాలూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అయితే చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో... తమ వాదనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని, వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని, సుప్రీం కోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని, కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందని సీఐడీ అనుమానం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని, 39 పేజీల తీర్పు మినీ ట్రయల్ నిర్వహణ జరిగిందనడానికి నిదర్శనమని సీఐడీ వ్యాఖ్యానించింది. దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయని, అందుకు పూర్తి ఆధారాలున్నా... హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించింది సీఐడీ.

చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉందని, సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారని అనుమానం వ్యక్తం చేసింది సీఐడీ... హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీం కోర్టులో తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరింది.

Tags:    

Similar News