ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ
*ప్రతి వాదులందరికీ పిటిషన్ కాపీలు అందజేయాలన్న సుప్రీం
Andhra Pradesh: ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతి వాదులందరికీ పిటిషన్ కాపీలు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. షెడ్యూల్ 9లో 89 సంస్థలు, షెడ్యూల్ 10లో 107 సంస్థలు ఉన్నాయని ఈ సంస్థలు దాదాపు 91శాతం తెలంగాణలో ఉన్నాయని ఏపీ తెలిపింది. లక్ష మందికి పైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని ఈ సంస్థల విభజన ఆలస్యం అవడం వల్ల ఏపీ నష్టపోతోందని పిటిషన్‌లో పేర్కొంది. సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.